టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న అరెస్టు

టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న అరెస్టు

విజయవాడ: కాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని, రాష్ట్ర డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేశారు. గుడివాడ వ్యవహారంపై మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మంత్రిని చంపుతానంటూ, రక్తం కళ్ల చూస్తానంటూ విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు అందగా వివరణ కోరేందుకు సోమవారం బుద్ధా వెంకన్న ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకతో టీడీపీ నేతలు హైడ్రామాకు తెర లేపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు.. పోలీసుల విచారణకు భంగం కల్గించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా, చివరకు బుద్ధా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos