బి.కొత్తకోట: నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తంబళ్ళపల్లి, మొలకలచెరువు, బి.కొత్తకోట పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. గత కొంతకాలంగా ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. ఇవాళ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పూర్తిస్థాయిలో చించివేయడంతో రచ్చ రోడ్డుకెక్కింది. మరోవైపు జయ చంద్రారెడ్డి అనుచరులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.