విపక్షాలు ఏకం కావాలి. అది కాంగ్రెస్‌తోనే సాధ్యం

విపక్షాలు  ఏకం కావాలి. అది కాంగ్రెస్‌తోనే సాధ్యం

హైదరాబాద్ : రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటంలో కేసీఆర్ విఫలమయ్యరని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘కేసీఆర్ ఎత్తుగడ బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడమే. కేసీఆర్ విధానం బీజేపీకి సహాయం చేయడమనే అనుమానం కలుగు తోంది. ఈ అంశంపై ఆల్ ఇండియా మహాసభలో చర్చ జరుగుతోంది. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిపై చర్చిస్తాం. తేజస్వి యాదవ్ కేసీఆర్ను కలిసినప్పుడు కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. బీజేపీ ఏతర అన్ని పార్టీలు ఏకం కావాలని.. అది కాంగ్రెస్తోనే సాధ్యం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై ఉగ్రదాడి అనేది పొలిటికల్ స్టంట్. కేసీఆర్, బీజేపీ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317జీవో వెంటనే రద్దు చేయాలి. జీవో ఆశస్త్రీయంగా ఉంది. ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలి. మన ఊరు మన బడి పేరుతో రూ. 3 వేల కోట్ల కైంకర్యం చేసేలా కనిపిస్తోంది. ఇంగ్లీష్ మీడియం తీసుకు వస్తున్నప్పటికీ మాతృ భాష తెలుగును కూడా సమాంతరంగా బోధించాలి. కాళేశ్వరం తప్ప ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. కేవలం 30 వేల ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేసారు. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింద’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos