చంద్రబాబును ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైంది…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మరోసారి నిప్పులు చెరిగారు.చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని అందుకే తీవ్ర భయాందోళనకు గురవుతూ ఇతర పార్టీల సభలు,సమావేశాలను అడ్డుకుంటున్నారంటూ విమర్శించారు. మార్చ్‌౩వ తేదీన నిర్వహించనున్న యాదవ గర్జన సభకు చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని సభకు అనుమతులు ఇవ్వకుండా పోలీసులపై కూడా ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నారంటూ ఆరోపించారు.సభకు అనుమతుల విషయమై ఎస్పీతో మాట్లాడితే ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తడి వస్తోందని ముఖ్యమంత్రి సభకు అనుమతులు ఇవ్వరాదంటూ ఆదేశించారని చెప్పారన్నారు. ప్రజాస్వామ్యంలో సమావేశాలు పెట్టుకొని మాట్లాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. “గతంలో నేను విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అక్కడి పోలీసులు వేధించారు. మనం ఇండియాలో ఉన్నామా? పాకిస్థాన్ లో ఉన్నామా? అని పోలీసులను అప్పుడే ప్రశ్నించాను. అయినప్పటికీ నేటికి కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు తమ విధానాలను మార్చుకోవడం లేదు.తెలంగాణలో చంద్రబాబు నాయుడు సమావేశాలు పెట్టుకున్నప్పుడు – రోడ్ షోలు నిర్వహించినప్పుడు తమ ప్రభుత్వం ఆటంకం కలిగించలేదని అయితే – ఏపీలో యాదవ బీసీ గర్జన సభ పెడుతామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తాముసభ పెట్టుకుంటామంటే బాబుకు భయమెందుకు అని  ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం – పోలీసులు వెంటనే స్పందించి బీసీ గర్జన సభకు అనుమతివ్వాలి ఏపీ పోలీసులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే.. ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేయిస్తా“అని తేల్చిచెప్పారు.ఏపీలో తన అనుచరులు – మద్దతుదారులపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.చంద్రబాబు ఇంటికి పోయే సమయం ఆసన్నమైందన్నారు. బడుగు – బలహీన వర్గాలకు – వెనుకబడిన తరగతుల వారికి ఏపీలో తీవ్ర నష్టం జరుగుతుందని అని తలసాని పేర్కొన్నారు. పోలీసులు సభకు అనుమతివ్వకపోతే.. కోర్టుకు వెళతామని మంత్రి తలసాని స్పష్టం చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos