రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోండి

రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోండి

హైదరాబాద్ : సినీ కార్మికుల సమస్యల్ని కూర్చొని పరిష్కరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫెడరేషన్కు పిలుపునిచ్చారు.బుధవారం ఇక్కడ విలేఖ రులతో మాట్లాడారు. ప్రభుత్వం జోక్యం చేసుకు నేవరకు వేచి చూడొద్దని హితవు పలికారు. కార్మిక శాఖకు సమ్మె లేఖ కూడా ఇవ్వలేదని, రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. కార్మికుల నిర్ణయం వల్ల చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయిందని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ ఆక్రోశించారు.‘ఈ నెల 6న మాకు ఫెడరేషన్ నుంచి లేఖ వచ్చింది. అంతకు ముందే వేతనాలపై ఫిలిం ఛాంబర్ ఆలోచిస్తోంది. ఇంతలోనే సమ్మె కట్టటం చాలా తప్పు. షూటింగ్లు ఆపేదే లేదు. రేపటి నుంచి యథావిధిగా కార్మికులు షూటింగ్స్కు హాజరు కావాలి. వేతనాలపై విధి విధానాలు రూపకల్పన చేస్తాం. ఐదు ఆంక్షలు విధించాం. నిర్మాతలపై ఒత్తిడి చేసే ఆలోచన ఉంటే విరమించుకోవాలి, సినీ కార్మికుల ఒత్తిడికి తలొగ్గి ఎవరూ వేతనాలు పెంచొద్దు, అందరం కలిసి షూటింగ్స్ జరుపుకుందాం, ఎల్లుండి వేతనాలపై చర్చిస్తాం, ఏ కార్మి కుడి కడుపు కొట్టాలని నిర్మాత చూడడు. కార్మికు లందరికి వేతనాలు పెంచడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక వేళ సినిమా కార్మికులు హాజరుకాకపోతే మేమే షూటిం గ్ లు ఆపేస్తాం. 2018లో వేతనాలపై ఒప్పందం చేసుకున్నాం. ఫిలిం ఫెడరేషన్ నాయకులు కార్మికుల కడుపు కొట్టొద్దు’ అని పేర్కొన్నాడు. హైదరాబాద్లో పరిసరాల్లో 20కి పైగా షూటింగ్లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్లు నిలిచి పోయాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos