నేటి నుంచి తాజ్ సందర్శన

నేటి నుంచి తాజ్ సందర్శన

ఆగ్రా: చారిత్రక కట్టడం తాజ్మహల్ సందర్శనకు సోమవారం నుంచి అనుమతించినట్లు పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద శానిటైజేషన్,థర్మల్ స్క్రీనింగ్, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు సంరక్షణ అధికారి అమర్నాథ్ గుప్తా తెలిపారు. ప్రతి శుక్రవారం తాజ్ మహల్ను మూసివేస్తారు. సందర్శ కులు ముందుగానే ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీయులకు ప్రవేశ రుసుము రూ.1,100, భారతీయులకు రూ.50. విడతకు 2,500 మంది చొప్పున రోజుకు 5,000 మందిని మాత్రమే అనుమతిస్తారు. పర్యాటకుల మధ్య దూరం, తనిఖీలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది నిర్వహించనున్నారు. తాజ్మహల్లోనికి ఎలాంటి వస్తువులు అనుమతించరు.. అంబులెన్స్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆగ్రా కోట సందర్శననూ సోమవారం నుంచి అనుమతించ నున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos