శృంగారతార స్వాతి నాయుడు వివాహం.

  • In Film
  • February 27, 2019
  • 1406 Views

తెలుగులో నటిగా రాణించాలనే ఆశతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నిరాదరణకు గురవడంతో యూట్యూబ్‌ శృంగార తారగా మారిన స్వాతి నాయుడు కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. అవినాష్‌ అనే యువకుడితో ఇదేనెల 23వ రాత్రి 12 గంటలకు విజయవాడలో బంధువులు,స్నేహితుల మధ్య స్వాతి నాయుడు తెలుగు సాంప్రదాయం ప్రకారం  వివాహం చేసుకున్నారు.

స్వాతి నాయుడు వివాహం విషయం తెలియగానే చాలా మంది పలు అనుమానాలు వ్యక్తం చేయగా మరికొంత మంది ఆశ్చర్యానికి గురయ్యారు.అయితే వీటన్నంటిని పటాపంచలు చేస్తూ స్వాతి నాయుడు తన భర్త అవినాష్‌ను పరిచయం చేస్తూ యూట్యూబ్‌లో ఇంటర్‌వ్యూ ఇచ్చారు.ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని కుటుంబ సభ్యులను వివాహం సందర్భంగా పరిచయం చేశారు.

అవినాష్‌ను పెళ్లాడి కొత్త జీవితం మొదలు పెట్టిన తనకు ప్రేక్షకులు, అభిమానుల ఆశ్వీరాదం కావాలని ఈ సందర్భంగా స్వాతి నాయుడు కోరారు. నటి కావాలనే కోరికతో సినీ రంగానికి వచ్చిన స్వాతి నాయుడు ఇక్కడ అవకాశాలు లేక పోవడంతో ఒకానొక సందర్భంలో తీవ్ర నిరాశకు లోనయ్యారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సినిమాల్లో అవకాశాలు లేవు. టీవీ ఛానల్స్ వారు కనీసం యాంకర్ గా కూడా తనకు అవకాశాలు ఇవ్వడం లేదని, బ్రతకడం కోసం నీలి చిత్రాలు చేయాలని ఉన్నా.. ఇండియాలో పుట్టడం వల్ల అవి చేయడం సాధ్యం కావడం లేదని సెన్సేషన్ ప్రకటన చేశారు. తనను అటు సినిమా రంగం, ఇటు టీవీ రంగం వారు దూరం పెట్టినా యూట్యూబ్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ శృంగార తారగా ఎదిగారు. మరి పెళ్లి తర్వాత స్వాతి నాయుడు నుంచి అభిమానులకు కావాల్సిన వినోదం లభిస్తుందో? లేదో?

తాజా సమాచారం

Latest Posts

Featured Videos