మోదీ పై స్వామి విమర్శలు

మోదీ పై స్వామి విమర్శలు

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి గురు వారం మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మోదీ సర్కారు దాదాపు ప్రతీ అంశంలోనూ విఫలమైందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కలిసిన ఒకరోజు తర్వాత సుబ్రమణియన్ స్వామి బీజేపీ సర్కారు వైఫల్యాల్ని ఎండగట్టారు. ‘ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైంది. అఫ్ఘానిస్థాన్ సంక్షోభంలో కేంద్రం వ్యవహరించిన తీరును సక్రమంగా లేదు. పెగాసస్ డేటా భద్రతా ఉల్లంఘించింద’ని దుయ్యబట్టారు. మమతా బెనర్జీని జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పివి నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతో సుబ్రమణ్యస్వామి పోల్చారు.‘‘మన అణ్వాయుధానికి చైనా భయపడకపోతే, వారి అణ్వాయుధానికి మనం ఎందుకు భయపడుతున్నాం?’’ అని ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos