గాలికి కొట్టుకు పోయిన మోదీ హామీలు

గాలికి కొట్టుకు పోయిన  మోదీ హామీలు

న్యూఢిల్లీ: బీహర్ కు ప్రత్యేక హోదా ప్రకటించే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. బీహార్ పట్ల వివక్ష కనబరిచిన మోదీ దీనిపై చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది. బాగల్పూర్ లో రూ.500 కోట్లతో సెంట్రల్ యూనివర్శిటీ నిర్మిస్తామని గత ఎన్నికల్లో ప్రకటించి చప్పట్లు కొట్టించుకున్నారు. దాని ఏర్పాటుకు ఒక్క ఇటుకా వేయలేదు. రూ.1,550 కోట్లతో బీహార్‌లో స్కిల్ డవలప్‌మెంట్ యూనివర్శిటీ కట్టిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ గాలికి కొట్టుకుపోయింది. దానిని వారణాసికి ఎందుకు తరలించారు? బక్సర్‌లో రూ.10,000 కోట్లతో 1,300 మెగావాట్ల ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న హామీ, రూ.1,500 కోట్లతో పాట్నా సిక్స్-లేన్ రోడ్ ప్రకటన, రూ.2,000 కోట్లతో మనహరి నుంచి సహాద్‌గంజ్ (జార్ఖాండ్)ను కలిపే వంతెన నిర్మాణం భరోసాల్ని చెత్తబుట్టలో పడేశారు? రూ.4000 కోట్లతో నిర్మిస్తామన్న శ్రీ రామ్-జానకి రోడ్, , నేపాల్ సరిహద్దు వరకూ వేస్తామన్న నాలుగు బాటల దారి, రూ.100 కోట్ల రామాయణ సర్క్యూట్, పురోనా, సీతామర్హిలో ‘ప్రత్యక్ష స్థల్ కాంప్లెక్స్’ పేరుతో సీతారాముల జీవిత చరిత్ర మ్యూజియం హామీలు ఎందుకు గాలికి కొట్టుకు పోయాయ’ని ప్రశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos