సూర్య త్యాగం..

  • In Film
  • November 16, 2020
  • 123 Views
సూర్య త్యాగం..

తమిళ స్టార్ హీరో సూర్య ఆకాశమే నీ హద్దురా సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. సౌత్ లో ఓటీటీ ద్వారా విడుదలైన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ సక్సెస్ అంటూ అంతా బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో సూర్య అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్య ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసి ఉంటే వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యేవి. దాన్ని మిస్ చేసుకున్నాడు. తానే నిర్మాత కనుక ఆయన సినిమాను కొన్నాళ్ల పాటు ఆపి ఉండవచ్చు కదా అంటూ అభిమానులు సున్నితంగా సూర్యపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఓటీటీలో ఈ సినిమా విడుదలపై రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూర్య క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి ప్రధాన కారణం ఆర్థికపరమైన ఇబ్బందులు. ఈ సినిమాను నేను నిర్మించినప్పటికి చాలా మంది పెట్టుబడి పెట్టి ఉన్నారు. వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా వారు పెట్టుబడి పెట్టారు. ఆ సినిమాలను విడుదల చేయడం సాధ్యం కాదు.ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది కనుక విడుదల చేస్తే వారు ఆర్థికంగా కాస్త అయినా ఊరట చెందుతారు. కనుక నా చుట్టు ఉన్న వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నేను ఓటీటీకి ఒప్పుకోవాల్సి వచ్చిందని అసలు విషయాన్ని సూర్య క్లారిటీగా చెప్పేశాడు. తనను నమ్మిన వారు కష్టాల్లో ఉన్నారని సూర్య త్యాగం చేశాడు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos