నవ్వుల పాలైన మంత్రి సురేశ్

నవ్వుల పాలైన  మంత్రి సురేశ్

పట్నా: ఎన్నికలు సమీపించిన వేళ నగరాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రి సురేష్ కుమార్ శర్మ నవ్వుల పాలయ్యారు. ఆయన ముజఫర్పూర్కు శాసనసభలో ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ముజఫర్పూర్ అభివృద్ధికి కృషి చేసినట్లు ఆయన చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘ముజఫరాపూర్ లైట్ యోజనా కింద భారీ వ్యయంతో నిర్మించిన రోడ్లపై 17,554 వీధి దీపాలను ఏర్పాటు చేశాం. మోదీతో కూడా ఉన్న పోస్టర్ తయారు చేయించి ట్విటర్లో పోస్టు చేపారు. మంత్రి షేర్ చేసిన రోడ్డు, స్ట్రీట్ లైట్ల ఫొటో నకిలీవని తేలింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా విషయం బయటపడటంతో నెటిజన్లు మంత్రిని ఏకి పారేస్తున్నారు. ఆయన షేర్ చేసింది హైదరాబాద్లోని బైరామల్గూడ ఫ్లైఓవర్ అని పేర్కొంటూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ను సురేష్కు జతపరిచారు. హైదరాబాద్లోని ఫ్లైఓవర్ ఫొటోలతో మస్కా కొట్టిస్తావా అంటూ తిట్టిపోస్తున్నారు. బైరామల్గూడ జంక్షన్ వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ఆగస్టు 9న ప్రారంభించారు. 780 మీటర్ల వెడల్పైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణ వ్యయం 26.5 కోట్లు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos