విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరించం

విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరించం

ప్రజావాహిని-బెంగళూరు

విద్యుత్‌ రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటీకరించబోమని మంత్రి సునిల్‌ కుమార్‌ గురువారం విధానసభలో స్పష్టీకరించారు. ఇండి సభ్యుడు యశవంత రాయ గౌడ విఠల గౌడ  పాటిల్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌ మీటర్లను అమర్చే యోచన ఏదీ లేదని తేల్చి చెప్పారు. అందువల్ల రైతులు ఎవ్వరూ భయ పడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. పారిశ్రామికుల సమావేశాన్ని త్వరలో నిర్వహించి వారి సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు.   ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లను తాత్కాలిక ప్రాతిదికన విద్యుత్‌ను విని యోగించుకునే కట్టడాలకు, ప్రభుత్వ కచ్చేరీలకు, ఇరవై ఏడు అమృత సిటీల్లో అమర్చదలచినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని బిగించబోమని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల  విద్యుత్‌ బకాయిలు రూ. 5,792 కోట్లకు  చేరిందన్నారు. దీన్ని నివారణకు ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్ల అమరిక అనివార్యమని తీర్మానించినట్లు పేర్కొన్నారు. బెస్కాం‌ తన పరిధిలో లక్ష నివాసాలకు ప్రీ పెయిడ్‌ మీటర్లు బిగించారు. వాటి పని తీరు ఇతర అంశాల్ని అధ్యయనం చేస్తున్నామని విపులీకరించారు.రాష్ట్ర ప్రభుత్వం మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు యూనిట్‌కు రూ.2.30 వంతున విక్రయించి పరిశ్రమలకు రూ. ఎనిమిది కి అమ్మటం న్యాయమాని యశవంతరావు పాటిల్‌ మొదట ప్రశ్నించారు. విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరిస్తారనే భయం సర్వత్రా నెలకొందని చెప్పారు.కాఫీ తోటలకు పది హెచ్‌పి వరకూ విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయాలని వీరాజపేట సభ్యుడు అప్పచ్చు రంజన్‌ చేసిన వినతికీ సునిల్‌ కుమార్‌ సానుకూలంగా స్పందించారు. అధికార్లతో చర్చించి తుది నిర్ణయాన్ని తీసుకుంటామని భరోసా ఇచ్చారు .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos