ఆత్మహత్యా యత్నంలో తల్లి మృతి…బిడ్డ క్షేమం

హొసూరు : స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం వేకువ జామున ఓ తల్లి తన ఏడాది కూతురితో ఆత్మహత్యకు పాల్పడింది. అదృష్టవశాత్తు బిడ్డ ప్రాణాలతో బయపడింది. ఆ మహిళ పట్టాలపై తల పెట్టి పడుకున్నట్లు తెలుస్తోంది. రైలు వెళ్లాక మొండెం నుంచి తల వేరుపడింది. పసి బిడ్డ గాయాలతో బయటపడింది. బిడ్డ ఏడుపు వినిపించడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూసి, పోలీసులకు సమాచారం అందించారు. 35 ఏళ్ల వయసు గల మహిళ శవాన్ని పోలీసులు

స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బిడ్డకు ఆసుపత్రిలో  చికిత్స చేయిస్తున్నారు. మృతురాలి సెల్‌ఫోన్‌ ఆధారంగా ఆమె వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos