ఇస్లామిక్ అధ్యయన ప్రవేశపరీక్షల్లో హిందూ యువకుడు టాపర్

ఇస్లామిక్ అధ్యయన ప్రవేశపరీక్షల్లో హిందూ యువకుడు టాపర్

శ్రీ నగర్ : కశ్మీర్ సెంట్రల్ విశ్వవిద్యాలయం ఇస్లామిక్ అధ్యయనంలో మాస్టర్ కోర్సు కోసం నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్షల్లో శుభం యాదవ్ అగ్ర స్థానాన్ని సాధించారు. ప్రవేశ పరీక్షను గత సెప్టెంబరు 20 న నిర్వహించారు. ముస్లిమేతరుడు అగ్రస్థానంలో నిలవడం మొదటిసారి అని ఆచార్య హమీద్ నసీమ్ చెప్పారు. ‘యాదవ్ ఢిల్లీ కళాశాలలో తత్వ శాస్త్రం(బీఏ) చదివారు. అప్పుడే ఇస్లామిక్ అధ్యయనంపై ఆసక్తి పెంచుకున్నాడు. అరబ్ వసంతం, ఇరాన్ సమస్యలు, ఇస్లాం, ప్రవక్త ముహమ్మద్ గురించి వివిధ పుస్తకాలు చదివారు. భవిష్యత్లో ఇస్లాం గురించి మరింత తెలుసుకునేందుకు మాస్టర్ డిగ్రీ కోసం చేరారు. ఐఎఎస్ అధికారి కాదలచిన తనకు ఇస్లామిక్ స్టడీస్ సహాయపడుతుందని ప్రొఫెసర్ హమీద్ నసీమ్ ఆశించారు. ‘ఇస్లాంను రాడికల్ మతంగా చిత్రీకరించారు. దాని గురించి చాలా అపోహలున్నాయి.సమాజంలో విభజన పెరుగుతున్నందున,ఇతర మతాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం’అని శుభం యాదవ్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos