సబ్‌ రిజిస్ట్రార్లుగా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు

సబ్‌ రిజిస్ట్రార్లుగా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు

అమరావతి: గృహ రుణాల నుంచి పేదల విముక్తికి వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలుకు గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు సచివాలయాల్లోని వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. పేదల ఇళ్ల దస్త్రాల రిజిస్ట్రేషన్ చేస్తారని గృహ నిర్మాణ శాఖ వెల్లడించింది. సచివాలయాల్లోని డిజిటల్ సహాయకులు వీరికి సహకరిస్తారని తెలిపింది. ఈ పథకం ఒక్క దాని కోసమే వీరు సబ్ రిజిస్ట్రార్లుగా పని చేస్తారు. ఇందుకోసం 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 6లో పాక్షిక మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos