సిగరెట్లు ఎన్నయినా…ఊపిరితిత్తులు గుల్లే…

సిగరెట్లు ఎన్నయినా…ఊపిరితిత్తులు గుల్లే…

ధూమపాన ప్రియులు ఆ అలవాటును సమర్థించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. తాను రోజుకు రెండే సిగరెట్లు తాగుతానని, కనుక ఊపిరితిత్తులకు ఏమీ కాదని తనకు తాను భరోసా ఇచ్చుకుంటూ ఉంటారు. రోజుకు నాలుగైదు సిగరెట్లు తాగితే ఏమీ కాదనే ధీమా వ్యక్తం చేసే పొగరాయుళ్లూ లేకపోలేదు. అయితే ఎన్ని సిగరెట్లు తాగినా ఊపిరితిత్తులకు ప్రమాదమేనని అమెరికాలోని కొలంబియా విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త ఎలిజబెత్ వోల్స్‌నర్‌ హెచ్చరించారు. ధూమపానం అలవాటు కలిగిన 25 వేల మంది 40 ఏళ్ల లోపు వారి ఊపిరితిత్తుల పనితీరు వివరాలను ఏడాది పాటు సేకరించి, పరిశీలించారు. రోజూ 30 సిగరెట్లు తాగేవారి ఊపిరితిత్తులకు ఎంత నష్టం జరుగుతుందో, నాలుగైదు సిగరెట్లు తాగేవారిలోనూ దాదాపు అదే స్థాయిలో ఆరోగ్యం గుల్లబారడాన్ని గుర్తించారు. వీరు దీర్ఘకాలంలో ఆస్తమా బారినపడే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos