వన్డే క్రికెట్‌కు బెన్ స్టోక్స్ గుడ్‌బై

  • In Sports
  • July 18, 2022
  • 90 Views
వన్డే క్రికెట్‌కు బెన్ స్టోక్స్ గుడ్‌బై

ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టోక్స్‌  మంగళవారం డర్హమ్‌లో దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ తనకు చివరిదని తెలిపాడు. ఈ ఫార్మాట్‌లో జట్టుకు ఇకపై అత్యుత్తమ సేవలు అందించలేనని పేర్కొన్నాడు. తనకు ఇన్నేళ్ల పాటు అండగా ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇకపై టీ20, టెస్టుపై పూర్తిగా దృష్టి పెడతానని చెప్పుకొచ్చాడు.
“మంగళవారం డర్హమ్‌లో నా చివరి మ్యాచ్‌ ఆడతాను. ఆ తర్వాత ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాను. ఈ నిర్ణయం ఎంతో కఠినమైనది. నా తోటి ప్లేయర్స్‌తో ఆడిన ప్రతిక్షణాన్ని ఎంతో ఆస్వాదించా. ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది.” అని అన్నాడు. కాగా, 2019 వన్డే ప్రపంచకప్ గెలవడంలో బెన్‌స్టోక్స్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఇటీవల అతడు టీమ్ఇండియాతో ఆడిన వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos