ఆరో త‌ర‌గ‌తి బాలిక‌కు ఫోన్ చేసిన స్టాలిన్

హొసూరు : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు ఆరో తరగతి విద్యార్థిని ప్రజ్ఞతో ఫోన్లో మాట్లాడి చిన్నారిని ఆశర్చర్య పరిచారు. ‘నేను తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని హోసూరులోని టైటన్ టౌన్షిప్కు చెందిన విద్యార్థిని. మా పాఠశాలను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని స్టాలిన్కు లేఖ రాసింది. అందులో తన ఫోన్ నంబరు కూడా ఇచ్చింది. ఆ లేఖను చదివిన స్టాలిన్ వెంటనే స్పందించి ప్రజ్ఞకు ఫోన్ చేసి మాట్లాడారు. తమిళనాడు వ్యాప్తంగా నవంబరు 1 నుంచి పాఠశాలలను తెరుస్తాము. కరోనా గురించి చింతించాల్సిన అవసరం లేదదు. జాగ్రత్తలు తీసుకుంటూ, టీచరు చేసే సూచనలు పాటిస్తూ పాఠశాలలకు వెళ్లవచ్చు’అని చెప్పారు. సీఎం తనకు ఫోన్ చేయడం పట్ల ప్రజ్ఞ హర్షం వ్యక్తం చేసింది. పాఠశాల ఎప్పుడు తెరుస్తున్నారో చెప్పాలని తాను లేఖ రాయగా. ముఖ్యమంత్రి స్వయంగా తనకు ఫోన్ చేయడం నమ్మ లేకపోయానని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos