జయ మృతిపై సమగ్ర విచారణ

జయ మృతిపై సమగ్ర విచారణ

చెన్నై : వచ్చే శాసనసభ ఎన్నికల్లో డీఎంకే గెలిచి, అధికారంలోకి రాగానే మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరుపుతామని ఆ పార్టీ అధినేత ము.క.స్టాలిన్ సోమవారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. జయ మృతి వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేస్తామన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన అప్పీలు వ్యాజ్యంపై ప్రభుత్వ తరఫు న్యాయవాదులు సక్రమంగా వాదించడం లేదని ఆరోపించారు. జయ మృతిపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ జడ్జి ఆర్ముగ సామి సమితిపై ఆరోపణలు రావటం దిగ్ర్భాం తి కలిగిస్తోందన్నారు. ఇక ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం తమ పదవుల కోసం విచారణ సమితి సక్రమంగా పని చేయకుండా అడ్డకుంటున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. జయలలిత మృతి వెనుక దాగిన కుట్రను వెలికి తీసేందుకు అన్నాడీఎంకే పాలకులు ప్రయత్నించకుండా విచారణ సమితి పేరిట కాలయాపన చేస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారన్నారు. విచారణ సమితి తమను తప్పుబట్టే రీతిలో సాగుతోందని ఆరోపించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం అత్యున్నత న్యాయస్థానం నుంచి స్టే పొందిందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos