రెండో రోజూ నష్టాలే

రెండో రోజూ నష్టాలే

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళ వారం కూడా నష్టపోయాయి. నష్టాలతో ఆరంభమైన మార్కెట్లు సాయంత్రం ముగిసే అలాగే ముగిసాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 205 పాయింట్లు నష్టపోయి 41,323 వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 12,169 వద్ద నిలిచాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.17 వద్ద నమోదైంది. మదుపర్లకు సానుకూల పరిణామాలు లేకపోవడం ఇందుకు కారణం. ఎన్ఎస్ఈలో భారతీ ఇన్ఫ్రాటెల్, జీ ఎంటర్టైన్మెంట్స్, భారత్ పెట్రోలియం, భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా షేర్లు లాభాల్ని గడించాయి. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్, పవర్గ్రిడ్ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos