సన్‌రైజర్స్ నుంచి ఈ ప్లేయర్స్ అవుట్ !

  • In Sports
  • November 13, 2020
  • 153 Views
సన్‌రైజర్స్ నుంచి ఈ ప్లేయర్స్ అవుట్ !

మరో ఆరు నెలల్లో ఐపీల్ 14 వ సీజన్ మొదలు కానుంది.ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఛాంపియన్ ముంబై ఇండియన్స్ సహా అన్ని జట్లు కొత్త ఆటగాళ్ల కొనుగోలు అవసరం లేని ఆటగాళ్ల ఉద్వాసనకు సిద్ధమవుతున్నాయి.ఈ సారి అనూహ్యంగా ప్లేఆఫ్స్ కు చేరిన హైదరాబాద్ జట్టు కూడా జట్టు మార్పుపై దృష్టి సారించింది.వచ్చే సీజన్‌కు ముందు జరగనున్న వేలం ద్వారా మిడిలార్డర్ సమస్యను పరిష్కరించుకునే అవకాశం సన్‌రైజర్స్ ముందుంది. మెగా వేలంలో ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకొని మరో ఇద్దరు ఆటగాళ్లను ఆర్టీఎం ద్వారా తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది. గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే తుది జట్టులో బరిలో దిగాలనే నిబంధన కారణంగా సన్‌రైజర్స్ వచ్చే సీజన్లో బెయిర్‌స్టోను వదులకునే అవకాశం ఉంది.2020 సీజన్లో సన్‌రైజర్స్‌‌కు వార్నర్, విలియమ్సన్, రషీద్, హోల్డర్ కీలకంగా మారారు. బెయిర్‌స్టో బదులు సాహో‌ను ఓపెనర్‌గా ఆడించడం ఫలితాన్ని ఇచ్చింది. దీంతో బెయిర్‌స్టోను రిలీజ్ చేసి.. మరో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం సన్‌రైజర్స్ ప్రయత్నించే అవకాశం ఉంది.జట్టులో ఫ్యాబియెన్ అలెన్ ఉన్నప్పటికీ.. అతడికి ఈ సీజన్లో ఆడే అవకాశం రాలేదు. మహ్మద్ నబీ రూపంలో వరల్డ్ నంబర్ 1 టీ20 ఆల్‌రౌండర్ ఉన్నప్పటికీ.. అతడికీ అరకొర అవకాశాలే వచ్చాయి. దీంతో వీరిద్దర్నీ సన్‌రైజర్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మనీష్ పాండే కోసం సన్‌రైజర్స్ రూ.11 కోట్లు వెచ్చించింది. కానీ అతడు తన ధరకు న్యాయం చేయలేకపోతున్నాడు. దీంతో అతణ్ని రిలీజ్ చేసి వేలం ద్వారా మళ్లీ తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన ఖలీల్ అహ్మద్ 9.42 ఎకానమీ రేట్‌తో 8 వికెట్లు తీశాడు. భువీ తిరిగి జట్టులో చేరితే అతడు ఆడే అవకాశం లేదు. ఇప్పటికే నటరాజన్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, బెసిల్ థంపీ, సిద్ధార్థ్ కౌల్ రూపంలో జట్టులో మెరగైన బౌలర్లు ఉన్నారు. దీంతో ఖలీల్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ రిలీజ్ చేయొచ్చు.ఎంత మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు తమతో అట్టిపెట్టుకోవచ్చు.. ఎంత మందిని రిటైన్ చేసుకోవచ్చు.. ఇందులో క్యాప్డ్ ప్లేయర్లు ఎందరు అనే విషయంలో మెగా వేలానికి ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వార్నర్, విలియమ్సన్, రషీద్, భువీ, నటరాజన్‌‌ లేదా సందీప్ శర్మను అట్టిపెట్టుకొని మిగతా వాళ్లను సన్‌రైజర్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.ఇక లీగ్ లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్లకి పంజాబ్ గుడ్ బై చెబుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.కెప్టెన్గా కేఎల్ రాహుల్, హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది.వీరితో పాటు మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, షమీ, గేల్, యువ లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్లను కొనసాగించే వీలుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos