స్పైస్ జెట్ లైసెన్స్ సస్పెండ్

స్పైస్ జెట్ లైసెన్స్ సస్పెండ్

న్యూ ఢిల్లీ : ప్రమాదకర వస్తువులను రవాణా చేసిందనే ఆరోపణపై స్సైస్ జెట్ లైసెన్స్ ను 30 రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) సోమ వారం తెలిపింది. దేశీయ, అంత ర్జాతీయ విమానాల్లో లిథియం – అయాన్ బ్యాటరీలతో సహా ప్రమాద కరమైన వస్తువులను తీసుకెళ్లేందుకు స్పైస్ జెట్ ను అనుమ తించబోమని వివరించింది. ఆరోగ్యం, భద్రత, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకరమైన వస్తువులను విమానాల్లో తీసుకెళ్లడం నిషిద్ధం. ఒక రవాణాదారు వాటిని ప్రమాదకరం కాని వస్తువులుగా ప్రకటించి నందునే ఈ ఘటన చోటుచేసుకుందని స్పైస్ జెట్ తెలిపింది. నష్ట నివారణ చర్యలను చేపట్టామని చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos