సభలోకి దిండు పట్టుకొచ్చిన ఎంపీ

సభలోకి దిండు పట్టుకొచ్చిన ఎంపీ

న్యూ ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొనటంతో సమావేశాలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. 12 మంది సభ్యుల సస్పెన్షన్ ను ఎత్తే యాలని విపక్ష సభ్యులు ఆందోళనలు చేశారు. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. లోక్ సభలో కనీస మద్దతు ధర చట్టం కోసం నినాదాలు చేశారు. ఒక సభ్యుడు దిండు పట్టుకుని నిరసించినందకు సభాపతి ఆగ్రహించారు. దీంతో ఆయన నిరసన విరమించారు. నిరసనల మధ్యే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్  షెకావత్ జలశయాల భద్రత ముసాయిదాను ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం తర్వాత కరోనా కొత్త రకం ఒమిక్రాన్ పై సభలో చర్చించనున్నారు. సభ్యులకు దానిపై మాట్లాడే అవకాశం ఇచ్చారు. శీతాకాల సమావేశాలు పూర్తయ్యే డిసెంబర్ 23 దాకా ఆందోళనలు చెయ్యాలని సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డోలా సేన్, శాంత ఛెత్రి నిర్ణయించారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా నిరసన తెలియజేయనున్నారు. విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజా స్వామికమని కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు శశిథరూర్ విమర్శించారు. విపక్షాల నిరసనను మహాత్మ గాంధీ చూస్తున్నారని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. అసలు పార్ల మెంట్ ను సజావుగా నడిపే ఉద్దేశం ప్రభుత్వానికుందా? అని ప్రశ్నించారు. ఇతరులూ గళాన్ని వినిపించే హక్కుందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. పార్లమెంట్ ఉన్నది చర్చల కోసమని, కాబట్టి ఇతర ఎంపీల అభిప్రాయాలనూ వ్యక్తం చేయనివ్వాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం