పోరాటాల్లో యువ నేతలు కీలకంగా ఉన్నారు

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి తానే ఫుల్ టైం అధ్యక్షురాలినని సోనియా గాంధీ శనివారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తేల్చి చెప్పారు. సమావేశానంతరం దీని గురించి ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు. పరోక్షంగా ‘జీ23’ నేతలకు ఓ హెచ్చరికలా స్పష్టతనిచ్చారు. పార్టీ నిర్మాణం, పోరాటాల్లో యువ నేతలు చాలా కీలకంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘వ్యవసాయ చట్టాలు, కరోనా పరిహారం, దళితులపై దాడులు, ప్రజా సమస్యలపై యువనేతలు బాగా పోరాడు తు న్నారు. ఏదైనా సవాల్ గా తీసుకుంటున్నారు. నాతో ఎవరైనా నేరుగా మాట్లాడవచ్చు. మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా స్వేచ్ఛగా, నిజా యతీగా చర్చించవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఉద్యమం చేబట్టి ఏడాది దాటినా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకో లేదు. ఆర్థిక వ్యవస్థ దిగ జారిపోతున్నా బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి అన్నింటినీ అమ్మడమే పరిష్కారమని బీజేపీ భావిస్తోంది. జమ్మూకశ్మీర్ లో మైనారిటీలపై దాడులు పెరిగి పోతున్నాయి. రెండేళ్లలో మైనారిటీల హత్యలు పెరిగాయ’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos