న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మంగళవారం రాజ్యసభలో మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మన్రేగా కింద ఇచ్చే కనీస వేతనాన్ని పెంచాలని, పని దినాల సంఖ్యను కూడా పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. జీరో అవర్‌లో ఈ అంశంపై ఆమె ప్రస్తావించారు. మన్రేగా స్కీమ్‌ను బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. ఆ స్కీమ్‌కు బడ్జెట్ కేటాయింపు జరపడం లేదన్నారు. స్కీమ్‌ను సజావుగా నడిపేందుకు అదనపు నిధుల్ని కేటాయించాలని ఆమె కోరారు. రోజువారీ కనీస వేతనాన్ని 400కు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని సోనియా గాంధీ ప్రభుత్వాన్ని కోరారు. మన్రేగా ద్వారా ఉద్యోగం, ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ చర్యలు అవసరమని ఆమె తెలిపారు.