అశోక్‌ లైలాండ్‌, టీవీఎస్‌లలో లేఆఫ్‌

  • In Money
  • September 12, 2019
  • 489 Views
అశోక్‌ లైలాండ్‌, టీవీఎస్‌లలో లేఆఫ్‌

హొసూరు : ఆర్థిక మందగమనం ప్రభావం ఒక్కో రంగంపైనే పడుతోంది. హొసూరు పారిశ్రామిక వాడలో లెక్కలేనన్ని కర్మాగారాలున్నాయి. వీటిల్లో వేల సంఖ్యలో కార్మికులు పని చేస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇప్పటికే కుదేలయ్యాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఎన్నో పరిశ్రమలు మూతపడగా, వేల సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయారు. తాజాగా పెద్ద పరిశ్రమలు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేస్తున్నాయి. వాణిజ్య వాహనాల తయారీ రంగంలోని అశోక్ లైలాండ్, టీవీఎస్ లాంటి దిగ్గజ పరిశ్రమలకు కూడా ఆర్థిక మందగమనం సెగ తాకింది. ఈ రెండు సంస్థల్లో వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పటికే ఆటోమొబైల్ రంగం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. మారుతి సుజుకి లాంటి కంపెనీలు ఉత్పత్తిని బాగా

తగ్గించి,అనేక మంది కార్మికులను తొలగించాయి. కేంద్ర ప్రభుత్వ కొత్త ఆటోమొబైల్ విధానం వల్ల అశోక్ లైలాండ్, టీవీఎస్‌ ల వాహనాల విక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేయడానికి నెలకు అయిదు రోజుల చొప్పున లేఆఫ్ ప్రకటించాయి. అశోక్ లైలాండ్ ఒకటో ప్లాంటులో 560 మంది, రెండో ప్లాంటులో 1,600 మంది శాశ్వత కార్మికులు పని చేస్తున్నారు. ఈ కంపెనీలకు అనుబంధంగా అనేక చిన్న పరిశ్రమలున్నాయి. వాటిల్లో వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా ఉపాధిని కోల్పోయారు. జీఎస్టీ, బీమా, బ్యాంకు రుణాల విధానాల వల్ల వాహనాల విక్రయాలు స్తంభించిపోయాయి. దరిమిలా ఉద్యోగాలపై వేటు పడక తప్పలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos