అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిందితుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్ కోసం ఆయన తరపు లాయర్లు హైకోర్టులో దాఖలు చేసిన పిటషన్ పై విచారణ బుధవారం ప్రారంభమయింది. చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోలేదని చెప్పారు. చంద్రబాబుపై విచారణ ప్రాథమిక దశలో ఉందని ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఏఏజీ పొన్నవోలు కోర్టును కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. రెండు వైపుల వాదనలను పూర్తిగా వినాల్సి ఉందని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పొన్నవోలు కోరారు. దీంతో, తదుపరి విచారణను వచ్చే మంగళ వారానికి వాయిదా వేశారు. ఆలోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. వచ్చే సోమవారం వరకు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.