పొత్తా..విలీనమా.. తేల్చండి

పొత్తా..విలీనమా.. తేల్చండి

లక్నో: ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పొత్తు లేక రెండు పక్షాల విలీనం గురించి వారం రోజుల్లోగా తీర్మానించాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు ఆయన చిన్నాన్న, ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ లోహియా (పీఎస్పీఎల్) అధ్యక్షుడు శివపాల్ యాదవ్ సూచించారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ”సమాజ్నాదీ పార్టీతో పొత్తుకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. ములాయం పుట్టిన రోజున పొత్తు కుదుతుందని రాష్ట్ర ప్రజలు ఆశావహంతో ఉన్నారు. ఏది జరిగినా సాధ్యమైనంత త్వరగా జరగాలి. ములాయాం సింగ్యాదవ్ మాకు కుస్తీతో పాటు రాజకీయాల్లో ఎత్తుగడల్నీ కూడా నేర్పారు. ఐక్యతలోనే బలం ఉంది. కుటుబంలో విభజన తలెత్తితే అనేక ఇబ్బందులు ఉంటాయి. మామ మద్దతుదారులకు 100 సీట్లు రావాలని కోరుకుంటున్నందునే మేము వెనక్కి తగ్గాం. పొత్తుతో పాటు, గెలుపు గుర్రాలకు ఎస్పీ టిక్కెట్లు ఇచ్చుకోవచ్చు. విలీనానికి మేము సిద్ధంగా ఉన్నాయని, కాలం గడిచిపోతున్నందున వెంటనే నిర్ణయాన్ని తీసుకోవాల’ని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos