వేగంగా విస్తరిస్తున్న కరోనా

వేగంగా విస్తరిస్తున్న కరోనా

చెన్నై: దేశంలో కరోనా వ్యాప్తి రేటు బాగా పెరిగిందని ఇక్కడి ఒక గణిత శాస్త్ర సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. మార్చి నెల 4 నుంచి కరోనా స్ వ్యాప్తి రేటు 1.83 కంటే తక్కువగా నమోదైంది. అన్లాక్ 2 నుంచి జూలైలో వ్యాప్తి రేటు పెరిగింది. ప్రభుత్వం వ్యాధి వ్యాప్తి రేటును ఒకటికి తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి రేటు సంఖ్య 1.19. అంటే సగటున వైరస్ సోకిన వ్యక్తి 1.19 మందికి దాన్ని వ్యాప్తి చేస్తున్నాడని అర్థమని సంస్ధకు చెందిన డాక్టర్ సితాబ్ర సిన్హా వెల్లడిం చారు. వ్యాప్తిలో హెచ్చు తగ్గుల అంచనాకు 10-14 రోజులు పడుతుంన్నారు. జూన్ నెల రెండో వారం నుంచి జులై ప్రారంభం వరకూ జరిగిన అనేక పరిణా మాలు కరోనా వ్యాప్తి రేటును పెంచాయని చెప్పారు. తన అంచనా ప్రకారం జులై నెలాఖరుకి దేశవ్యాప్తంగా ఆరు లక్షల యాక్టివ్ కరోనా కేసులు ఉంటా యన్నారు. జులై 21 నాటికి మహారాష్ట్రలో కేసులు 1.5 లక్షలకు, తమిళనాడు లక్షకు చేరొచ్చని లెక్కగట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos