పోలీసు సినిమాలు తీసినందుకు సిగ్గుపడుతున్నా

పోలీసు సినిమాలు తీసినందుకు సిగ్గుపడుతున్నా

చెన్నై: పోలీసుల సేవలను ప్రశంసిస్తూ సినిమాలను తీయబోనని సింగం, ‘సామి’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు హరి గోపాల కృష్ణన్ సోమవారం ఇక్కడ ప్రకటించారు. తూత్తుకూడి సమీపంలోని పదంకుళంలో తండ్రీ, కొడుకులను పోలీసులు లాకప్ లో చిత్ర హింసలకు గురి చేసి హతం చేసినందుకు ఈ మేరకు నిరసించారు.‘ పోలీసుల ధైర్య సాహసాలను హైలైట్ చేసి ఎన్నో చిత్రాలను నిర్మించిన నేను, ఇప్పుడు సిగ్గుపడుతున్నా. జయరాజ్, బెన్నిక్స్ హత్యలు అత్యంత దారుణం. మరోసారి ఇటువంటి ఘటనలు తమిళనాడులో జరుగకుండా కోరుకుంటున్నా. కొందరు పోలీసుల వల్ల మొత్తం పోలీసు శాఖ ప్రతిష్ట పాతాళానికి పడిపోయింది. పోలీసుల సేవలను ప్రశంసించి సినిమాలు తీసినందుకు ఇప్పుడు చింతిస్తున్నా. మరోసారి ఇలాంటి సినిమాలు తీయబోన’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos