గద్దె దిగిన సిద్ధూ

గద్దె దిగిన సిద్ధూ

న్యూ ఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఓటమికి బాధ్యత వహిస్తూ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించింది. ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుడు, పంజాబ్ ప్రదేశ్ సమితి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ”కాంగ్రెస్ అధ్యక్షురాలు కోరిన విధంగా నేను నా పదవికి రాజీనామా చేశా.” అని ట్విట్టర్లో పేర్కొన్న సిద్ధూ.. రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. సిద్ధూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ పదవి చేపట్టారు. ఉత్తర్ప్రదేశ్, మణిపుర్, గోవా పీసీసీ సారథులపై నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వేటు వేసారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ విభాగాలను పునర్వ్యవస్థీకరించనున్నామని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్లో వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos