కన్నడిగులకు ఉచిత వ్యాక్సిన్ ఉండదేమో?

కన్నడిగులకు ఉచిత వ్యాక్సిన్ ఉండదేమో?

బెంగళూరు: కర్ణాటకలో ఎలాంటి సార్వత్రిక ఎన్నికలు లేనందున కన్నడిగులకు ఉచిత కరోనా టీకాలు ఉండవేమోనని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరికీ కరోనా టీకాల్ని ఉచితంగా ఇస్తామని మఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటిస్తారా అని వరుస ట్వీట్లలో ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తే ఉచితంగా కరోనీ టీకాల్ని వేస్తామని దని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా స్పష్టంగా చెప్పారు. కోవిడ్ మహమ్మారి కేంద్రానికి ఆందోళన కలిగించడం లేదా? దీనిపై ప్రధాని మోదీ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ‘కర్ణాటకలో ప్రస్తుతం ఎన్నికలు లేవు. దాని అర్ధం కన్నడిగులకు ఉచిత వ్యాక్సిన్ ఉండదనా? కన్నడిగులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కర్ణాటకకు చెందిన 25 మంది ఎంపీలు, ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడుగుతారని ఆశించిన’ట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఉచిత వ్యాక్సిన్ కోసం కన్నడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోదీ తరఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ మేరకు హామీ ఇస్తారా? లేక కర్ణాటక సీఎంకు వ్యతిరేకంగా ఆయన కుట్ర (సార్వత్రిక ఎన్నికల కోసం) చేస్తారా? ’అని హేళన చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos