శోభ కరంద్లాజె పై కేరళ పోలీసు కేసు

శోభ కరంద్లాజె పై కేరళ పోలీసు కేసు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతిచ్చినందుకు మల ప్పురంలోని కుట్టిపురంలో హిందువులకు నీటి సరఫరా అడ్డుకున్నరని ట్వీట్ చేసిన తనపై కేరళ పోలీసులు కేసు నమోదు చేయడం దురదృష్ట కరమని భాజపా లోక్సభ సభ్యురాలు శోభా కరంద్లాజే వ్యాఖ్యా నించారు. ‘దేశ వ్యతిరేక, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తున్న వారిని ఏమాత్రం పట్టించు కోవడం లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చూస్తున్నారన్నా’రు. శోభా కరంద్లాజే ట్వీట్తో కుట్టి పురంలో మత సామర స్యానికి తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉందంటూ సుప్రీంకోర్టు న్యాయవాది, మలప్పురం స్థానికుడు అయిన సుభాష్ చంద్ర కేఆర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతంలో నీటి సంక్షో భం ఉంది. చుట్టుపక్కల ప్రజలు ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన గొట్టపు బావి నీటిని వాడుకుంటున్నారు. దాన్ని వ్యవసాయ అవస రాల కోసం వాడితే కనెక్షన్ తొలగిస్తామని కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు హెచ్చరిం చడంతో ఆ వ్యక్తి నీటి సరఫరా నిలిపేసినట్లు’ అధి కార్లు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos