కాస్టింగ్ కౌచ్ పై శివజ్యోతి వ్యాఖ్యలు..

  • In Film
  • October 28, 2020
  • 99 Views
కాస్టింగ్ కౌచ్ పై శివజ్యోతి వ్యాఖ్యలు..

తీన్మార్ వార్తలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన శివజ్యోతి అలియాస్ సావిత్రి బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులర్ అయింది.తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ పాల్గొని బిగ్ బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ లో ఛాన్స్ రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని బయట ప్రచారం జరుగుతోందని ఈ విషయంపై మీ స్పందన ఏమిటని శివజ్యోతిని ప్రశ్నించగా.. కమిట్మెంట్ సంగతి తనకు తెలియదని.. ఇతర కంటెస్టెంట్ల విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని.. కానీ తన విషయంలో మాత్రం ఎలాంటి కమిట్మెంట్ కి సంబంధించిన విషయాలు చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది.అలాగే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు రోజులో ఎక్కువ సేపు మేల్కొనే ఉండాలని అంతేగాక ఆహార పదార్థాల విషయంలో కూడా షో నిర్వాహకులు చాల జాగ్రత్తలు పాటిస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శివజ్యోతి టీవి ఛానెల్ లో వర్క్ చేస్తూనే యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos