కొత్త పార్టీ – శివసేన(బాలాసాహెచ్‌) ఆరంభం

కొత్త పార్టీ – శివసేన(బాలాసాహెచ్‌) ఆరంభం

ముంబై : మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు గ్రూప్ లీడర్ ఏక్నాథ్ షిండే ప్రకటించారు. అయితే కొత్త పార్టీ పేరు శివసేన(బాలాసాహెచ్)గా ఉండొచ్చని ఆయనవర్గీయులు చెప్తున్నారు. బాల్థాక్రే సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఉండబోతోందని, దీనిపై సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 38 మంది తిరుగుబాటు ఎమ్మెల్యే కుటుంబాలకు భద్రతను ఉపసంహరించుకోవడంపై ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, దుర్మార్గంగా వ్యవహరించొద్దంటూ సీఎం ఉద్దవ్థాక్రే, మహారాష్ట్ర హోం మంత్రి, డీజీపీలకు లేఖ రాశారు. వాళ్లకేదైనా జరిగితే సీఎం థాక్రే, పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos