శివసేన అనర్హత అస్త్రం‌

శివసేన అనర్హత అస్త్రం‌

ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలక మలుపులే చోటు చేసుకుంటున్నాయి. తిరుగుబాటుదార్లపై అంతిమంగా అనర్హత అస్త్రం ప్రయోగించింది శివసేన. ఏక్నాథ్ షిండే సహా 11 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని విధానసభ ప సభాపతి నరహరి జిర్వాల్ను లిఖిత పూర్వకంగా కోరింది. అనర్హత వేటుకు జంకేదే లేదని ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. ‘భయ పెట్టడానికి మీరెవరు?.. చట్టం కూడా మాకు అనుకూలంగా ఉందం’టూ వరుస ట్విట్ లు చేసారు. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్కు ఏక్నాథ్ షిండే లేఖ రాశారు. శివసేన లేజిస్లేచర్ పార్టీ నేతగా తను, చీఫ్ విప్గా బి.గోల్వేల్ ఎంపికైనట్లు షిండే ఉపసభాపతికి తెలిపారు. గవర్నర్, అసెంబ్లీ కార్యదర్శికి నకలు ప్రతుల్నిపంపారు. శివ సేన నుంచి ఏక్నాథ్ షిండే వైపు మరికొందరు ఎమ్మెల్యేలు తరలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 37 మంది ఎమ్మె ల్యేలు ఆయన వర్గంలో అధికారికంగా ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు తరలి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎంపీలు కూడా తిరుగుబాటు దార్లతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నా యి. ‘యాభై మంది ఎమ్మెల్యేలు మద్దతు మాకు ఉంది. అందులో నలభై మంది శివ సేన ఎమ్మెల్యేల’ని షిండే విలేఖరులకు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos