ఎదురు కాల్పులపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్

ఎదురు కాల్పులపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్

న్యూఢిల్లీ: చటాన్ పల్లి వద్ద దిశ నిందితులను పోలీసులు ఎదురు కాల్పుల్లో హతం చేసినందుకు అత్యున్నత న్యాయ స్థానంలో న్యాయవాది ఎంఎల్ శర్మ వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని శర్మ ఆరోపించారు. రాజ్యసభ సభ్యులు జయాబచ్చన్, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ లను ప్రతివాదులుగా చేర్చారు. వీరు ఎదురు కాల్పుల్ని సమర్థించి మాట్లాడారని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మాధ్యమాలు కథనాలు ప్రసారం చేయ కుండా ఆంక్షలు విధించాలని కోరారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కొద్దిగా ఆలస్యమైనా సరైన పనే చేశారని జయా బచ్చన్ ఎదురు కాల్పుల గురించి వ్యాఖ్యానించారు.నిందితులు పారి పోతుంటే పోలీసులు చూస్తూ ఊరు కో వాలాని స్వాతి మలివాల్ స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos