మంత్రి రోజా భర్త సెల్వమణి పై అరెస్ట్‌ వారెంట్‌

మంత్రి రోజా భర్త సెల్వమణి పై అరెస్ట్‌ వారెంట్‌

చెన్నై : పరువు నష్టం దావా కేసులో ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సినీ నటి రోజా భర్త సెల్వమణి కి ఇక్కడి జార్జి టౌన్ కోర్టు నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2016లో ఓ తమిళ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెల్వమణి తనను కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారని సినీ ఫైనాన్షియర్ -ముకుంద్చంద్ బోత్రా ఆరోపించారు. విచారణకు సెల్వమణి గైర్హాజరయినందుకు కోర్టు ఈ చర్య తీసుకుంది. 2016లో అరెస్టయిన ముకుంద్చంద్ బోత్రాకు వ్యతిరేకంగా సెల్వమణి పలు ఆరోపణలు చేశారు. బోద్రా మరణించగా ఆయన తనయుడు గగన్ కోర్టులో కేసును కొనసాగిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos