ఇండియా పేరుపై సుప్రీం కోర్టులో పిటిషన్..

ఇండియా పేరుపై సుప్రీం కోర్టులో పిటిషన్..

కొద్ది సంవత్సరాలుగా దేశంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.సామాజికంగా,రాజకీయంగానే కాకుండా ప్రజల్లో సైతం చాలా మార్పులు కనిపిస్తున్నాయి.గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజల్లో జాతీయభావం పెరుగుతోంది.గతంలో కూడా ప్రజల్లో జాతీయ భావం ఉన్నా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇది మరింత పెరిగింది.ఇదే స్పూర్తితో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఇండియా పేరును భారత్‌ లేదా హిందుస్ధాన్‌గా మార్చాలంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. 1948లో దేశం పేరును భారత్ లేదా హిందూస్థాన్‌గా పెట్టాలని బలమైన వాదన వినిపించిందని గుర్తు చేశారు. పిటిషన్ జూన్ 2 తేదీన విచారణకు రానుంది. పేరును ఎందుకు మార్చాలో కూడా పిటిషన్ లో వివరించారు.
దేశం పేరు మార్చడంవల్ల ప్రజల్లో ఆత్మగౌరవం – జాతీయభావం పెరుగుతుందని తెలిపారు. దేశం పేరును మార్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇండియా అనేది ఇంగ్లీష్ పదమని దానిని తొలగించి స్వదేశీ భాషలో పేరు పెడితే అది ప్రజలకు గర్వకారణంగా ఉంటుందన్నారు.పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి నమహ్. ఇండియా అనే పేరును ఉపయోగించడం ద్వారా బానిసత్వ చిహ్నాన్ని తొలగించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వాస్తవానికి దేశం పేరు మార్చాలని దాఖలైన పిటిషన్ ఇవాళ సుప్రీం కోర్టులో విచారణకు ముందే లిస్ట్ అయింది. అయితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో తర్వాత లిస్ట్ నుండి పిటిషన్ను తొలగించారు. కోర్టుకు అందుబాటులో ఉన్న నోటీసు ప్రకారం జూన్ 2తేదీన ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos