బుల్​డోజర్లతో కూల్చివేతలు ఆపలేం

న్యూ ఢిల్లీ: వివిధ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసే విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తు న్నప్పుడు అధికారులు కచ్చితంగా చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల చెలరేగిన అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. ఇది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టులో వ్యాజ్యాలుదాఖలయ్యాయి. వీటిని విచారించిన అత్యున్నత ధర్మాసనం మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని అదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos