ఆరే కాలనీలో మెట్రో నిర్మాణానికి అనుమతి

ఆరే కాలనీలో మెట్రో నిర్మాణానికి అనుమతి

న్యూఢిల్లీ : బృహన్ముంబయ్ నగర పాలక సంస్థ (బీఎంసీ)లోని ఆరే కాలనీలో మెట్రో షెడ్ నిర్మాణాన్ని కొనసాగించేందుకు అత్యున్నత న్యాయస్థానం సోమవారం అనుమతించింది. అయితే చెట్లను ఇకపై నరకరాదని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తా ధర్మాసనం ఆంక్షల్ని విధించింది. మొక్క లు నాటడం, చెట్ల నరికివేత యథాతథ స్థితి నివేదికను, ఫొటోలతో సహా సమర్పించాలని ఆదేశించింది. ఆరే కాలనీలో అదనంగా చెట్లను తొలగించ డం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బీఎంసీ తరపున విన్నవించారు. అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా యథా తథ స్థితిని కొనసాగి స్తున్నామని చెప్పారు. సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి కూడా ఇది మాదిరి హామీ ఇచ్చారు. తదుపరి విచారణ నవం బరు 5కు వాయిదా పడింది. 

తాజా సమాచారం