గృహ రుణ రేట్లను భారీగా పెంచేసిన ఎస్బీఐ

గృహ రుణ రేట్లను భారీగా పెంచేసిన ఎస్బీఐ

ముంబై : ఎస్బీఐ గృహ రుణ గ్రహీతల వడ్డీ రేట్లను అర శాతాన్ని పెంచింది. ఈ విధానం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండిం గ్ రేటు 6.65 శాతంగా, రెపో లింక్డ్ లెండింగ్ రేటు 6.25 శాతంగా ఉన్నాయి. వీటికి క్రెడిట్ రిస్క్ రూపంలో కొంత శాతాన్ని కలిపి రుణాలపై రేట్లను ఎస్బీై అమలు చేస్తుంటుంది. ఆర్బీఐ కీలక రేట్లను సవరించినప్పుడల్లా రుణాలపై రేట్లను బ్యాంకులు సైతం సవరిస్తుంటాయి. ఇటీవలే రెపో రేటును 0.40 శాతం మేర ఆర్బీఐ సవరించడం తెలిసిందే. దీనికంటే మరో 0.10 శాతం అదనంగా ఎస్బీఐ రుణ రేట్లను పెంచడం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos