ఆర్యన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొడుకు కావడమే అరెస్ట్ కు కారణం

ఆర్యన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొడుకు కావడమే అరెస్ట్ కు కారణం

ముంబై : మాదక ద్రవ్యాల కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు కావడం వల్లే ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేశారని సీనియర్ నటుడు, రాజకీయవేత్త శత్రుఘ్నసిన్హా వ్యాఖ్యానించారు. ‘ ఆర్యన్ అరెస్ట్ కు షారుఖ్ ను టార్గెట్ చేయడం మాత్రమే కారణం. ఎన్సీబీ అరెస్ట్ చేసిన వారిలో మున్ మున్ ధమేచా, అర్బాజ్ మర్చెంట్ వంటి వారు కూడా ఉన్నారు. వారి గురించి ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. గతంలో కూడా ఇలాగే జరిగింది. కొందరిని ఎన్సీబీ విచారించిన సమయంలో కేవలం దీపికా పదుకుణేపై మాత్రమే ఫోకస్ చేశారు. షారుఖ్ ముస్లిం అయినందుకే టార్గెట్ చేశారని భావిం చడం లేదు. ముస్లిం అయినందుకే ఇలా చేస్తున్నారంటూ ఇప్పుడు కొందరు అంటున్నారు. అయితే అది నిజం కాదు. ప్రతి భారతీయుడు కూడా ఈ దేశ పుత్రుడే. రాజ్యాంగం ప్రకారం అన్ని మతస్థులకు సమాన హక్కులు ఉన్నాయ’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos