హైదరబాద్లో కొందరిని విడిగా కలవబోతున్నా

హైదరబాద్లో కొందరిని విడిగా కలవబోతున్నా

న్యూ ఢిల్లీ : పార్టీ అధ్యక్షుడినైతే ఏం చేస్తాననే విషయంపై ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్ ప్రణళిక తయారు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘ మేమందరం ఒక్కటే. మాకు సిద్ధాంత వైరుధ్యాలు లేవు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే మా చర్చ. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ ఫ్యామిలీలో అంతర్గత చర్చ జరుగుతోంది. హైదరబాద్లో కొందరిని విడిగా కలవబోతున్నా. కాంగ్రెస్ పార్టీ మౌలిక విషయాల్లో నాది, ఖర్గేది ఒకే వైఖరి. కాంగ్రెస్ పార్టీని ముందు కు తీసుకెళ్లడంలో ఎవరు శక్తి మంతులు అనేదే ప్రధాన ప్రశ్న. నేను ఇటీవలే ఖర్గేతో మాట్లాడా. ఆయన ఒక గొప్ప నేతని, ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. స్వేచ్ఛాయుత ఎన్నికలకు గాంధీ కుటుంబం కట్టుబడి ఉంది. తెలంగాణ నాయకులతో నాకు మంచి సంబంధాలున్నాయి. కాంగ్రెస్లో జీ 23 అనేదే లేదు. నా విజన్ నాకుంది. ఖర్గే విజన్ ఆయనకుంది. పార్టీ నాయకత్వాన్ని కేంద్రీకరించాల్సి ఉంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఇంటికి ఆహ్వానించారు. కానీ వెళ్ళలేకపోయా. రేవంత్ పిలిస్తే తప్పకుండా గాంధీ భవన్కు వచ్చి ప్రచారం చేసుకుంటాన’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos