వింబుల్డన్ కు సానియా మీర్జా వీడ్కోలు

వింబుల్డన్ కు సానియా మీర్జా వీడ్కోలు

న్యూ ఢిల్లీ : భారత టెన్నిస్ దిగ్గజం సానియామీర్జా కెరీర్ ప్రతిష్ఠా త్మక వింబుల్డన్ కు గురు వారం వీడ్కోలు పలికింది. మిక్స్ డ్ డబుల్స్ సెమీస్ లో ఓటమిపాలైన తర్వాత ఆమె భావో ద్వేగంతో స్పందించింది. ‘మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాల పరంగా క్రీడలు కీలక పాత్ర వహిస్తాయి. గెలుపులు, ఓటములు, గంటల కొద్దీ హార్డ్ వర్స్, ఎంతో పోరాడి ఓడిన తర్వాత నిద్రలేని రాత్రులు. కానీ ఇవన్నీ నీకు బదులుగా ఎంతో ఇస్తాయి. కన్నీళ్లు, సంతోషం, పోరాటం, సంఘర్షణ… ఇవన్నీ కూడా చివరకు మన కష్టానికి దక్కే ఫలితాలే. వింబుల్డన్ ఒక అద్భుతం. గత 20 ఏళ్లుగా ఇక్కడ ఆడటం ఒక గౌవరం. ఐ మిస్ యూ’ అంటూ సామాజిక మాధ్యమంలో ప్రకటించింది. 2015లో విమెన్స్ డబుల్స్ లో సానియామీర్జా టైటిట్ ను గెలుపొందింది. విమెన్స్ డబుల్స్ లో సానియా యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ లను గెలుచుకుంది. మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్ లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ లను గెలుపొందింది. ఒకానొక సమయంలో విమెన్స్ డబుల్స్ లో వరల్డ్ నంబర్ వన్ గా కూడా నిలబడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos