ఎన్సీపీ, మమతాబెనర్జీలపై విమర్శలు

ఎన్సీపీ, మమతాబెనర్జీలపై విమర్శలు

ముంబయి : శివసేన పార్టీ పత్రిక – సామ్నా సంపాదకుడుగా ఉద్ధవ్ఠాక్రే తిరిగి బాధ్యతలు చేపట్టారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం , నిత్యావసర సరకులపై జీఎస్టీ పెంపు పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ పిలుపు నిచ్చినా, ఆయా నిరసన కార్యక్రమాల్లో ఎన్సీపీతో పాటు మమతాబెనర్జీ తృణమూల్ పార్టీలు పాల్గొననందుకు తన సంపాదకీయంలో విమర్శించారు. విపక్షాల నేతలపై కేంద్రప్రభుత్వం ఈడీ, సీబీఐలతో దాడులు చేయించి వేదిస్తున్నా నిరసనలో విపక్షాల నేతలు పాల్గొనక పోవడాన్ని తప్పు పట్టారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు శివసేనకు చెందిన సంజయ్ రౌత్ లను అరెస్టు చేసేటప్పుడు పోలీసులు చూపించిన ప్రతాపాన్ని సామ్నా ఖండించింది. ప్రజా స్వామ్యంలో విపక్షాల నేతల పాత్రను ప్రశ్నార్థకం చేస్తూ ఈడీ దాడులు చేయడాన్ని వ్యతిరేకించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు మమతా బెనర్జీ దూరం కావాటాన్నీ విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos