కరోనా నోరు, ముక్కు, కళ్ల ద్వారా వెళ్తోంది

కరోనా నోరు, ముక్కు, కళ్ల ద్వారా వెళ్తోంది

విజయవాడ:‘కరోనా చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లడం లేదు. నోరు, ముక్కు, కళ్ల ద్వారా వెళ్తోంద’ ని ప్రముఖ వైద్యులు సమరం అన్నారు. కరోనా మహమ్మారి విషయంలో రెండు రోజుల నుంచి తనలో కూడా కొంచెం భయం పెరిగిందన్నారు.‘ఇటలీలో కరోనా పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత చర్యలు చేపట్టారు. భారత్ లో ప్రారంభ దశలోనే జాగ్రత్త చర్యలను ఆరంభించారు. ఈ జబ్బు జంతువుల నుంచి వచ్చింది.ఇప్పుడు మనిషి నుంచి మనిషికి పాకుతోంది. మన దేశంలో మనుషుల కలయిక చాలా ఎక్కువ. దీంతో వైరస్ వేగంగా విస్తరి స్తుంది. విస్తరణ కట్టడికి జనతా కర్ఫ్యూ మంచి కార్యక్రమం. కరోనా వల్ల జనాల్లో ఒక విధమైన ఉద్విగ్నత పెరిగింది. చప్పట్లు కొట్టడం, అరవడం, కేకలు వేయడం, డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం వంటి వాటితో మనలో మంచి మూడ్ వస్తుందని. ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయని, తద్వారా టెన్షన్ కు దూరమవుతామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos