ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరాటం

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి  పోరాటం

లక్నో : వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఏ పార్టీతోనూ కూటమి ఏర్పాటు చేయడం లేదు. అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెడుతుంది. ఒక వేళ ఇతర పార్టీలు తమతో చేతులు కలపాలనుకుంటే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేతృత్వంలో పోటీ చేస్తాం. పార్టీ గెలుపునకు ఆమె తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంద’ న్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాలకు గాను బిజెపి 312 స్థానాల్లో గెలుపొందింది. సమాజ్వాదీ పార్టీ 47, బహుజన్ సమాజ్ పార్టీ 19 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్కు కేవలం 7 సీట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం