నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్: నాగార్జున సాగర్ గేట్లు సోమవారం తెరుచుకున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున రేడియల్ క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్కుమార్ జల హారతి ఇచ్చారు. దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ క్రస్టు గేట్ల ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నీటి నిల్వ 290 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos