‘పవరొమాంటిక్’ పోస్టర్

‘పవరొమాంటిక్’ పోస్టర్

హైదరాబాదు : రామ్ గోపాల్ వర్మ శనివారం ‘పవరొమాంటిక్’ పోస్టర్ ఇదిగో అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది ఇందులో నటిస్తున్న రష్యన్ మహిళ పోస్టర్. ఆమెతో బాటు పీకే, ఎమ్మెస్, ఎన్బీ, టీఎస్, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా లోగోగా జనసేన పార్టీ గుర్తు-గాజు లోటా, పవన్ కల్యాణ్ చదివే పుస్తకాల్ని ఎంపిక చేసారు.‘ఈ వినూత్నమైన పోస్టర్లను గొప్ప నైపుణ్యాలున్న క్రియేటివ్ సైకో డిజైన్ చేశాడు’ వర్మ చెప్పారు. కృష్ణ కార్తీక్ అనే యువకుడు ఈ పోస్టర్లను రూపొందించాడు. వాటిని తన సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేస్తున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos